: జనాలపై నిప్పులు కుమ్మరించిన భానుడు.. మంచిర్యాలలో ఏకంగా 46.2 డిగ్రీల నమోదు!

అవును! తెలంగాణపై బుధవారం భానుడు నిప్పులు కురిపించాడు. ఎన్నడూ లేనంతంగా మండిపోయాడు. ఎండవేడికి తెలంగాణ ఉడికిపోయింది. జనాలు బయటకు వచ్చేందుకు భయపడ్డారు. మంచిర్యాల జిల్లా అయితే ఏకంగా ఎవరో రాజేసిన నిప్పుల కుంపటిలా మారిపోయింది. మంచిర్యాల, లక్సెట్టిపేట, మందమర్రి, జన్నారం, శ్రీరాంపూర్, గోలేటి, దండేపల్లి, రామకృష్ణాపురం, ఇందారంలలో బుధవారం ఏకంగా 46.2 డిగ్రీలు నమోదైంది.

ఇక శ్రీరాంపూర్, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఓపెన్ కాస్ట్ బొగ్గు బావుల్లో అయితే ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో మిగతా జిల్లాలైన ఆదిలాబాద్‌లో 44.1, మెదక్, మహబూబ్‌నగర్‌లలో 43, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని అన్ని వాతావరణ కేంద్రాల్లోనూ సాధారణం కంటే 1.3 డిగ్రీల నుంచి 3.7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం (నేడు) కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

More Telugu News