: డీటీహెచ్ సర్వీసుల ప్రారంభానికి సిద్ధమైన రిలయన్స్ జియో

రిలయన్స్ జియో డీటీహెచ్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధ‌మైంది. ఈ సర్వీసులను వ‌చ్చేనెల‌ నుంచి ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ ప్ర‌తినిధులు ప్రకటించారు. ప‌లు ప్ర‌త్యేక‌త‌ల‌తో వీటిని రూపొందించిన‌ట్లు తెలిపారు. జియో సెట్ టాప్ బాక్స్‌ను ఇంటర్‌నెట్ సేవలకు అనుసంధానం చేసేందుకు వీలుగా రూపొందించినట్లు చెప్పారు. ఈ స‌ర్వీసులను అందించే క్ర‌మంలో ప‌లు నగరాల్లో జియో సిబ్బంది పనులు ప్రారంభించినట్లు తెలిపారు. జియో డీటీహెచ్ సెటప్ బాక్స్ ధర 1800 రూపాయలుగా ఉండ‌నుంది. అలాగే జియో డీటీహెచ్ ప్లాన్ (లోయెస్ట్) రూ.180 కు నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News