: కిమ్ జాంగ్ కన్నా ట్రంపే డేంజరస్: రష్యా

ఉత్తరకొరియా నియంత కింమ్ జాంగ్ ఉన్ కన్నా అమెరికా అధ్యక్షుడు ట్రంపే చాలా డేంజరస్ అని రష్యా అధికారిక టీవీ ఛానల్ తెలిపింది. ట్రంప్ ఆలోచనలను అంచనా కూడా వేయలేమని వెల్లడించింది. కిమ్ జాంగ్ తన మూడేళ్ల కుమార్తెకు తన కార్యాలయంలో ఎలాంటి చోటును కల్పించలేదని... కానీ ట్రంప్ మాత్రం తన 35 ఏళ్ల కుమార్తెకు వైట్ హౌస్ లో కీలక పాత్రను కట్టబెట్టారని చెప్పింది.

ఉత్తరకొరియా పట్ల అమెరికా అనుసరిస్తున్న వైఖరి చాలా తీవ్రంగా ఉందని... సిరియాపై చేసిన దాడుల కంటే ఉత్తరకొరియాపై అమెరికా చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపింది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి లావ్ రోవ్ మాట్లాడుతూ, సిరియాపై దాడి చేసిన విధంగానే ఉత్తరకొరియాతో అమెరికా ప్రవర్తించదనే భావిస్తున్నట్టు తెలిపారు. తమకు సరిహద్దు దేశమైన ఉత్తరకొరియాతో తాము మంచి సంబంధాలనే కొనసాగిస్తామని... అయితే, తమ బంధం చైనా తరహాలో మాత్రం ఉండదని చెప్పారు. 

More Telugu News