: బొమ్మకారు నడుపుతున్న మూడేళ్ల బాలుడికి చలానా వేసిన ట్రాఫిక్ పోలీసులు!

బొమ్మకారు నడుపుతున్న మూడేళ్ల బాలుడికి ట్రాఫిక్ పోలీసులు చలానా వేసిన ఆస‌క్తిక‌ర‌, సరదా ఘ‌ట‌న కెన‌డాలో చోటు చేసుకుంది. నాథన్ అనే చిన్నారి తన బొమ్మకారును తీసుకొని వారి ఇంటి ముందు రోడ్డుపై అటూ ఇటూ తిప్పుడూ ఆడుకుంటున్నాడు. ఆ బాలుడి వెంటే వారి పెంపుడు శునకం ఉంది. అది చూసిన ఓ పోలీసు వెంట‌నే ఆ బాలుడి ద‌గ్గ‌ర‌కు వచ్చి వేగంగా న‌డిపిస్తున్నావంటూ చలాన్‌ రాసి ఇచ్చాడు.

విష‌యం తెలుసుకున్న ఆ బాలుడి తల్లి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. అయితే, ఆ పోలీసులు డబ్బులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పాడు. ట్రాఫిక్‌ ఉల్లంఘనకు తొలి చలాన్‌ను అందించామ‌ని, ఇది స‌ర‌దాగానే చేశామ‌ని అన్నాడు. నాలుగేళ్ల పాటు తల్లికి బట్టలు ఉతకడంలో సాయం కూడా చేయాలని ఆ బాలుడికి శిక్ష విధిస్తున్న‌ట్లు చెప్పి వెళ్లిపోయాడు. మొత్తానికి ఇంత చిన్న వ‌య‌సులోనే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్య‌క్తిగా నాథ‌న్‌ వార్త‌ల్లోకెక్కాడు. సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.

More Telugu News