: ఈ సంవత్సరం భారీగా వేతనాలు పెరిగే విభాగాలను ప్రకటించిన టీమ్ లీజ్!

మీరు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా రంగాల్లో ఉద్యోగిగా ఉన్నారా? అయితే మీకిది శుభవార్తే. గత రెండు సంవత్సరాల కాలంతో పోలిస్తే, ప్రస్తుత సంవత్సరం వీరి వేతనాల పెంపు భారీగా ఉంటుందని టీమ్ లీజ్ జాబ్స్, శాలరీస్ ప్రీమియర్ - 2017 నివేదిక వెల్లడించింది. గడచిన నాలుగేళ్లుగా సాలీనా వేతన పెంపు విషయమై అంతంతమాత్రంగా ఉన్న ఐటీ రంగం, ఈ సంవత్సరం ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం ఇవ్వనున్నాయని, సగటున 11.2 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని పేర్కొంది.

ఇదే సమయంలో రియల్ ఎస్టేట్, వాహన, తయారీ రంగాలు, వాటి అనుబంధ పరిశ్రమల్లో ఉద్యోగుల వేతన పెంపు మరింతగా మందగించనుందని, పెద్ద నోట్ల రద్దు కారణంగా ఈ రంగాల్లో వృద్ధి కుంచించుకుపోయిందని టీమ్ లీజ్ పేర్కొంది. ఇక ఎఫ్ఎంసీజీ, రిటైల్ రంగాల్లో సంతృప్తికరమైన వేతన వృద్ధి ఉంటుందని, డిమాండ్ కు తగ్గట్టుగా నిపుణులైన ఉద్యోగులు లేనందున బ్లూ కాలర్ జాబ్స్ కు డిమాండ్ భారీగా ఉంటుందని అంచనా వేసింది. శారీరక దృఢత్వం, కనీస విద్య, సమాచార మార్పిడిలో నైపుణ్యం ఉన్న వారికి ఈ రంగంలో డిమాండ్ అధికమని తెలిపింది. దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో పర్మినెంట్, టెంపరరీ ఉద్యోగుల మధ్య తేడా స్వల్పమేనని కూడా ఈ నివేదిక వెల్లడించింది.

More Telugu News