: శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం కనిష్ఠ స్థాయికి!

వేసవి కాలం ప్రారంభంలోనే శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి  తీవ్ర ఇబ్బంది నెలకొంది. శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం తగ్గుముఖం పట్టి కనిష్ఠస్థాయికి చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 803 అడుగులు మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగు నీరు అందించాలన్న కృష్ణా బోర్డు నియమాలతో విడతల వారీగా ఇక్కడి నుంచి నీటిని వినియోగిస్తుండటంతో డ్యామ్ నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. దీంతో, నీటి కొరతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది వర్షభావ పరిస్థితుల కారణంగా కృష్ణా నదికి పూర్తి స్థాయిలో నీరు చేరకపోవడం, డ్యామ్ లో ఉన్న నీటిని వినియోగించడంతో జలాశయంలో నీటి మట్టం అడగంటింది.

More Telugu News