: కుల్ భూషణ్ జాదవ్ కేసును వాదించేందుకు భారత్ పరిశీలనలో వున్న లాయర్లు!

కుల్ భూషణ్ జాదవ్ భారతీయుడని, అతనిని రక్షించేందుకు అన్ని మార్గాలు వినియోగించుకుంటామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుల్ భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై పాకిస్థాన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఆ దేశ ఆర్మీ న్యాయస్థానం రెండు నెలల గడువు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఎవరిని న్యాయవాదిగా నియమించే అవకాశం ఉందన్న దానిపై చర్చ నడుస్తోంది. భారత్ ముందు నలుగురు న్యాయవాదులు కనిపిస్తున్నారు. వారి వివరాల్లోకి వెళ్తే... పాకిస్థాన్ లో ప్రముఖ మానవ హక్కుల న్యాయవాదిగా పేరొందిన ఆస్మా జహంగీర్‌ అయితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడైన జహంగీర్‌ మానవీయ కోణంలో జాదవ్‌ కేసును వాదిస్తారని భారత న్యాయనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరువాత అన్సర్‌ బర్నీ పేరును పలువురు సూచిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున మానవహక్కుల పరిరక్షణ ఉద్యమంలో ఈయన చురుకైన పాత్ర పోషించడం విశేషం. అంతే కాకుండా ఆయన ప్రస్తుతం ఖైదీల హక్కుల పరిరక్షణ, ఉరిశిక్ష రద్దు కోసం విశేషమైన సేవలందిస్తున్నారు. అలాగే జిబ్రాన్‌ నాసిర్‌, ఐతజాజ్‌ అహసాన్‌ ల పేర్లను కూడా భారత న్యాయనిపుణులు సూచిస్తున్నారు. ఈ నలుగురిలో ఎవరైనా సమర్థవంతంగా వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

More Telugu News