: మమ్మల్ని రెచ్చగొడితే.. అణు దాడి చేస్తాం: అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్

తమను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే అణు దాడులకు దిగుతామంటూ అమెరికాను ఉత్తరకొరియా హెచ్చరించింది. అమెరికా నేవీ స్ట్రైక్ గ్రూప్ పశ్చిమ పసిఫిక్ లో ఉత్తరకొరియా వైపు దూసుకు వస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరకొరియా సమస్యను చైనా పరిష్కరించాలని... లేకపోతే ఆ పని తామే చేయాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేథ్యంలో, అమెరికా ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగినా సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నామని ఉత్తరకొరియా అధికారిక పత్రిక రోడోంగ్ సిన్ మున్ తెలిపింది. మరోవైపు, ఆరో అణు పరీక్షకు ఉత్తరకొరియా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శనివారం నాడు ఉత్తరకొరియా అధ్యక్షుడి తాత కిమ్ 2 సంగ్ 105వ జయంతి సందర్భంగా ఈ అణుపరీక్ష జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి. 

More Telugu News