: చంద్రబాబుకు హైదరాబాద్ లో ఇల్లు ఉండకూడదా?: విపక్షాలపై మండిపడ్డ దేవినేని ఉమ

ఏపీ సీఎం చంద్రబాబు గృహ ప్రవేశాన్ని కూడా విపక్షాలు రాజకీయం చేశాయని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ‘ఉన్న ఇల్లు తొలగించి కొత్త ఇల్లు కట్టుకుంటే తప్పేంటి? చంద్రబాబుకు హైదరాబాద్ లో ఇల్లు ఉండకూడదా? లోటస్ పాండ్ లో జగన్ 70 గదుల ఇల్లు అక్రమార్జనతో కట్టిందే. చంద్రబాబు ఇంటి నిర్మాణంపై కావాలని చెప్పే జగన్ బురదజల్లుతున్నారు. ఈడీ కేసుల నుంచి కాపాడాలని ఢిల్లీ నేతలను జగన్ వేడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రత్యేకహోదా అంటూ కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత దిగ్విజయ్ సింగ్ కు లేదు’ అని ఉమ అన్నారు.

More Telugu News