: వినోద్ ఖన్నా చికిత్సకు సహకరిస్తున్నారు: వైద్యులు

బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ప‌లు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న చికిత్స పొందుతున్న గుర్గాంలోని హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్, రీసెర్చ్ సెంటర్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ...  ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. ఆయ‌న‌ వైద్యానికి సహకరిస్తున్నారని అన్నారు. డీ హైడ్రేషన్ తో బాధ‌ప‌డుతున్న వినోద్ ఖ‌న్నాను ఆసుప‌త్రిలో చేర్పించామ‌ని ఆయ‌న కుమారుడు ఇటీవ‌లే తెలిపారు. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయ‌న‌ అన్నారు.

More Telugu News