: లాలూను ఇరుకున పెడుతున్న మట్టి కుంభకోణం వివరాలు!

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు లేనిపోని తల నొప్పులు వచ్చి పడ్డాయి. తన పెద్ద కుమారుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నిర్వాకంతో ఈయన వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మట్టి కుంభకోణం లాలూను సతమతమయ్యేలా చేస్తోంది. లాలూను ఇబ్బంది పెడుతున్న ఆ మట్టి కుంభకోణం ఏమిటో ఓ సారి చూద్దాం.

బీహార్ రాజధాని పాట్నా శివార్లలో లాలూకు ఒక పెద్ద స్థలం ఉంది. ప్రస్తుతం అక్కడ ఒక పెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో, సెల్లార్ కోసం అక్కడ నుంచి భారీ ఎత్తున మట్టిని తొలగిస్తున్నారు. అయితే, ఈ మట్టిని ఎలాంటి టెండర్ కూడా లేకుండానే... పాట్నా జూ పార్క్ కు రూ. 90 లక్షలకు విక్రయించారు. అటవీశాఖను నిర్వహిస్తున్న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం మొత్తం జరిగింది.

జూపార్క్ ప్రభుత్వానికి చెందినది కావడంతో, అక్కడ జరిగే అన్ని కార్యకలాపాలకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ, ఎలాంటి టెండర్ లేకుండానే లాలూ స్థలం నుంచి భారీ ఎత్తున మట్టిని కొనడం వివాదాస్పదమైంది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. విపక్షాలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. తమ మిత్రపక్షమే తమపై విచారణకు ఆదేశించడంతో లాలూ కూడా మనస్తాపానికి గురయ్యారు.

More Telugu News