: ఈ చిన్నారి సూపర్ స్టార్ అవుతుందని ఎవరైనా ఊహించి ఉంటారా!: రామ్ గోపాల్ వర్మ

నాటి అందాల నటి శ్రీదేవి అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఎంత పిచ్చో ఆయనే ఎన్నో సందర్భాల్లో చెప్పారు. శ్రీదేవి అందంగా ఉంటుందని, ఆమె నటన అద్భుతంగా ఉంటుందని వర్మ ఎన్నోసార్లు చెప్పారు. తాజాగా, చిన్నారి శ్రీదేవి తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఓ ఫొటోను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఈ చిన్నపిల్ల భారతీయ చలన చిత్ర సీమలో పెద్ద సూపర్ స్టార్ అవుతుందని ఎవరైనా ఊహించి ఉంటారా.... శ్రీదేవి బోనీకపూర్ నిజంగా ఓ అద్భుతం’ అంటూ ఆ ట్వీట్ లో వర్మ పేర్కొన్నారు. కాగా, వర్మ దర్శకత్వంలో గతంలో తెరకెక్కిన క్షణక్షణం, గోవిందా గోవిందా చిత్రాల్లో శ్రీదేవి నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు రవి ఉద్యావర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మామ్’ చిత్రంలో శ్రీదేవి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ ఏడాది జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

More Telugu News