: ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు విజేతలు వీరే!

2012, 2013 సంవత్సరాలకు గాను ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డులను ఈ రోజు సాయంత్రం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతల వివరాలను సినీ నటులు బాలకృష్ణ, మురళీ మోహన్ ప్రకటించారు. వాటి వివరాలు ..

* 2012 - ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
* 2012 - బీఎన్ రెడ్డి అవార్డు.. సింగీతం శ్రీనివాసరావు
* 2012 - రఘుపతి వెంకయ్య అవార్డు .. కోడి రామకృష్ణ
* 2012 - నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు .. డి.సురేష్ బాబు

* 2013 - ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డు.. హేమమాలిని
* 2013 - బీఎన్ రెడ్డి అవార్డు.. కోదండరామిరెడ్డి
* 2013 - రఘుపతి వెంకయ్య అవార్డు.. వాణిశ్రీ
* 2013 - నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు .. దిల్ రాజు

More Telugu News