: ఇండియా, పాక్ ల వివాదంలో తల దూర్చనున్న ట్రంప్?

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు దశాబ్దాలు గడుస్తున్నా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఉద్రిక్తతలు తగ్గిపోతాయన్న అంచనాలు కూడా ఎవరికీ లేవు. చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలంటూ అగ్రదేశం అమెరికా సైతం ఎన్నో సందర్భాల్లో సలహాలను మాత్రమే ఇచ్చింది కానీ... చర్చల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా ఈ అంశంపై ఎన్నడూ స్పందించలేదు.

కానీ, ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ మొదలైతే మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో పాల్గొనడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య చర్చల్లో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పాల్గొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

More Telugu News