: ఆఫ్ఘనిస్థాన్ లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు చేతులు కలుపుతున్న చైనా, రష్యా, పాకిస్థాన్!

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌ను మెరుగుప‌ర్చేందుకు చైనా, పాకిస్థాన్, రష్యా దేశాలు ఒక్క‌ట‌య్యే అవ‌కాశాలు ఉన్నాయని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ నుంచి ఎదుర‌వుతున్న యుద్ధ ప‌రిస్థితుల‌తో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్థాన్ విష‌యాన్ని అమెరికా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పాకిస్థాన్, రష్యాలు భావిస్తున్నాయ‌ని, అందుకే ఈ దేశాలు ఆఫ్ఘ‌నిస్థాన్‌లో సాధార‌ణ ప‌రిస్థితుల‌ను తీసుకురావాల‌ని చూస్తున్నాయ‌ని తెలిపింది. ఆఫ్ఘ‌నిస్థాన్‌ విషయంలో అమెరికా తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తోందని ఈ దేశాలు భావిస్తున్న‌ట్లు పేర్కొంది. ఆ దేశంలో సుస్థిరతకు రాజకీయ పరిష్కారమే లక్ష్యంగా ఈ మూడు దేశాలు కూటమిగా ఏర్పడాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ ప‌త్రిక‌లో పేర్కొన్నారు.

More Telugu News