: ఏపీలో ఆరుగురి శాఖల మార్పు... అందుతున్న సంకేతాలు!

మంత్రి వర్గ విస్తరణలో భాగంగా నిన్న ఐదుగురిని తొలగిస్తూ, 11 మందిని కొత్తగా చేర్చుకున్న చంద్రబాబు, వారికి కేటాయించాల్సిన శాఖలపై ఈ ఉదయం నుంచి చేసిన కసరత్తు పూర్తి అయినట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. ఇక ఆరుగురి శాఖలు మారనున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ ఆరుగురూ ఎవరన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, మొదటి నుంచి మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి, మరికొందరికి కోత విధిస్తారని తెలుస్తోంది. శాఖలు మారే జాబితాలో గంటా శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, కేఈ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దేవినేని, మాణిక్యాలరావు, యనమల తదితరుల శాఖల్లో మార్పు ఉండకపోవచ్చని సమాచారం.

 కాగా, బొజ్జల, పల్లె రఘునాథరెడ్డిల తొలగింపుతో, అటవీ, సాంకేతిక, సహకార, సమాచార పౌర సంబంధాలు, ఐటీ, ఎన్ఆర్ఐ వ్యవహారాలు, మైనారిటీ శాఖలు, మృణాళిని తొలగింపుతో గ్రామీణాభివృద్ధి, హౌసింగ్, శానిటేషన్, రావెల తొలగింపుతో సాంఘిక, ఎస్సీ సంక్షేమ శాఖలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ శాఖలతో పాటు చంద్రబాబు వద్దే ఉన్న పర్యాటక, సినిమాటోగ్రఫీ, పరిశ్రమల శాఖలను కొత్త మంత్రులకు అప్పగించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

More Telugu News