: టీ ట్వంటీల్లో టాప్-5లోకి దూసుకొచ్చిన పాకిస్థాన్... 2వ స్థానంలో టీమిండియా!

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు టాప్‌ 5లో చోటు దక్కించుకుంది. వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్.. ఆ దేశంతో జ‌రిగిన‌ టీ ట్వంటీ సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంతో ర్యాంకును మెరుగుప‌ర్చుకుంది. నిన్న‌టి వ‌ర‌కు పాకిస్థాన్ టీట్వంటీ ఫార్మాట్‌లో 6వ స్థానంలో, వెస్టిండీస్‌ 4వ స్థానంలో ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ విజ‌యంతో ర్యాంకులు తారుమార‌య్యాయి. ఇప్పుడు పాకిస్థాన్ 115 పాయింట్లతో 4వ స్థానంలో ఉండ‌గా, వెస్టిండీస్ 114 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉంది. ఇక‌ న్యూజిలాండ్‌ 127 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా 124 పాయింట్ల‌తో రెండో స్థానంలో ఉంది. ఆ త‌రువాత దక్షిణాఫ్రికా(117), ఇంగ్లాండ్‌(114) టీమ్‌లు ఉన్నాయి.

ఇటీవ‌ల జ‌రిగిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో పాకిస్థాన్ ఆట‌గాళ్లు పాల్ప‌డ్డ‌ స్పాట్‌ ఫిక్సింగ్ తో అభిమానులు వారిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డ విష‌యం తెలిసిందే. వెస్టిండీస్‌పై పాక్ విజ‌యం వారిని కాస్త చ‌ల్ల‌బ‌రిచింది.

More Telugu News