: వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రో ధరలు

గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలు శుక్రవారం భారీగా తగ్గాయి. లీటరు పెట్రోలుకు రూ.3.77, లీటర్ డీజిల్‌కు రూ.2.91 తగ్గింది. తగ్గిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో పెట్రోలు లీటరు రూ.72.14, డీజిల్ రూ.61.43కు చేరుకుంది. ఆయిల్ కంపెనీలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయని ఆయిల్‌ కంపెనీల సమాఖ్య తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కనిష్టానికి చేరుకోవడంతో బ్యారెల్ క్రూడాయిల్ ధర నాలుగు నెలల కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా బ్యారెల్ ధర 50 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పెట్రో ధరల నియంత్రణ నిర్ణయాన్ని కేంద్రం ఆయిల్ కంపెనీలకు అప్పగించినప్పటి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇంధన ధరలను సవరిస్తున్నాయి.

More Telugu News