: లైంగిక వేధింపుల ఘటనలకు బాధ్యత వహిస్తూ నలందా వర్సిటీ వీసీ రాజీనామా

నలందా యూనివర్సిటీలో విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనల నేపథ్యంలో తాత్కాలిక వైస్ చాన్సలర్ గా ఉన్న పంకజ్ మోహన్ తన పదవికి రాజీనామా చేశారు. యూనివర్సిటీలో చోటుచేసుకున్న సమస్యలకు నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నానని చాన్సలర్ విజయ్ భత్కర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు సహచర విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. వీరిలో ఒకర్ని సస్పెండ్ చేశామని, మరొక విద్యార్థిని వేరే హాస్టల్ కు మార్చామని యూనివర్సిటీ మీడియా ఇన్ చార్జ్ స్మితా పొలైట్ తెలిపారు. నెల క్రితం ఈ ఇద్దరు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తమకు ఫిర్యాదు అందిందని, విచారణ తర్వాత చర్యలు తీసుకున్నామని చెప్పారు.

More Telugu News