: జీఎస్టీకి ఆమోదం... ధరలు పెరిగేవి, తరిగేవి!

పన్నుల వసూలును తేలిక చేయడంతో పాటు, పన్నుల ఎగవేతకు కళ్లెం వేయాలన్న లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ, సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులకు లోక్ సభ ఆమోదం పలికింది. ఏకీకృత పన్ను విధానంలో భాగంగా వ్యాపారులపై వేధింపులు ఉండవని ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

ఇక ప్రతిపాదిత పన్ను రేట్లను పరిశీలిస్తే, వంట నూనెలు, మసాలా దినుసులు, టీ, కాఫీ తదితరాలపై 5 శాతం, కంప్యూటర్లు, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపై 12 శాతం, సబ్బులు, నూనెలు, షేవింగ్ సామానులు తదితరాలపై 18 శాతం, విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతం పన్ను ఉంటుంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు, పండ్లు, చికెన్ వంటి ఉత్పత్తులపై పన్నులు ఉండవు.

జీఎస్టీ అమలుతో షాంపులు, చాక్లెట్లు, బ్రెడ్, బ్యాటరీలు, టాయిలెట్ ప్రొడక్టులు, రెస్టారెంట్ భోజనాలు, చిన్న కార్లు, డైరెక్ట్ టు హోం డిష్ సెట్లు, ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలు తగ్గుతాయి. ఇదే సమయంలో లగ్జరీ కార్లు, సిగరెట్, బీడీలు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు, బ్రాండెడ్ శీతల పానీయాల ధరలు పెరుగుతాయి.

More Telugu News