: రహానే రూపంలో కెప్టెన్ దొరకడం టీమిండియా అదృష్టం: ఇయాన్ చాపెల్

టీమిండియా కెప్టెన్ కోహ్లీ దూకుడును ఆసీస్ ఆటగాళ్లతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దూకుడుగా ఉండే కోహ్లీ విమర్శలు పెరగడంతో మరింత దూకుడుగా వెళ్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీంతో కోహ్లీపై దుమ్మెత్తిపోయడం ద్వారా ఉపయోగం లేదని భావించిన ఆసీస్, ప్రతిభావంతుడైన రహానేను ఆకాశానికెత్తడం ద్వారా కోహ్లీని చిన్నబుచ్చే వ్యూహాన్ని అమలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఇయాన్ చాపెల్ రహానేను ఆకాశానికెత్తాడు. రహానే చివరి టెస్టులో అద్భుతంగా జట్టును నడిపించాడని కొనియాడాడు. దూకుడైన కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువైన విషయం కాదని, అయినా రహానే సమర్ధవంతంగా తనదైనశైలిలో జట్టును నడిపించాడని అభినందించాడు. నాయకత్వంలో కోహ్లీ, రహానేది భిన్నమైన శైలి అని, అందుకే రహానే వెనుక జట్టంతా నిలిచిందని ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. 

More Telugu News