: అత్యాచారం చేస్తుంటే యువతి కేకలు పెట్టలేదన్న కారణంతో... నిందితుడు నిర్దోషిగా విడుదల

తనపై అత్యాచారం జరుగుతుండగా, ఓ యువతి అరిచి కేకలు పెట్టలేదన్న కారణాన్ని చూపుతూ, ఓ ఇటలీ కోర్టు నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తడంతో, న్యాయ శాఖ విచారణకు ఆదేశించింది. ఓ మహిళా సహోద్యోగిని రెడ్ క్రాస్ సంస్థలో పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడన్న ఆరోపణలు రావడంతో, విచారించిన కోర్టు, ఆ సమయంలో మహిళ ప్రతిస్పందన అత్యాచారం జరిగిందనడానికి మద్దతిచ్చేలా లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆమె కేవలం 'ఆపు, ఇక చాలు' అని మాత్రమే అన్నదని, సహాయం కోసం కేకలు పెట్టడం, ఏడవటం వంటివి చేయలేదని, ఈ కారణంగా నిందితుడిని వదిలేస్తున్నామని పేర్కొంది. బాధితురాలు మాత్రం, తాను నిశ్చేష్టురాలినయ్యానని, అవతలి వ్యక్తి చాలా బలవంతుడని వాపోయింది. ఇక ఈ కేసులో తీర్పు వ్యవహారం బీబీసీ సహా పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెలుగులోకి తేగా, ఇటలీ న్యాయ వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును మరోసారి విచారించాలని కోర్టును కోరినట్టు ఇటలీ న్యాయ మంత్రి అన్నాగ్రాజియా కలాబ్రియా వెల్లడించారు.

More Telugu News