: 'బాహుబలి-2'కు ముఖేష్ అంబానీ సాయం చేశాడట.. తెరపైకి కొత్త వాదన!

'బాహుబలి-2' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ సినిమా ట్రైలర్ విడుదలైన గంటల్లోనే రికార్డులను బద్దలు కొట్టింది. మరే భారతీయ సినిమాకు సాధ్యంకాని రీతిలో సోషల్ మీడియాలో వ్యూస్ ను సాధించింది. 24 గంటల్లోనే 5 కోట్లకు పైగా వ్యూస్ ను సాధించింది. ప్రంపంచంలో ఇప్పటి వరకు అధ్యధిక లైక్స్ సాధించిన చిత్రం 'అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్స్'ను బాహుబలి మించిపోయింది. అవెంజర్స్ కు మొత్తమ్మీద 5.16 లక్షల లైక్స్ రాగా... బాహుబలి-2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టింది. 5.57 లక్షల లైక్స్ సాధించి హాలీవుడ్ సినిమాలకు సైతం సవాల్ విసిరింది.

అయితే, బాహుబలికి ఈ రేంజ్ లో వ్యూస్, లైక్స్ దక్కడంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇది బాహుబలి గొప్పతనం కాదని, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గొప్పతనమని కొందరు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. రిలయన్స్ కు చెందిన జియో ఫ్రీ డేటాను ఆఫర్ చేస్తుండటంతోనే... బాహుబలి ట్రైలర్ ను జనాలు అన్నిసార్లు చూశారని అంటున్నారు. జియో ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో... ఇకపై రానున్న సినిమాలకు ఈ రికార్డ్ సాధ్యం కాకపోవచ్చని చెబుతున్నారు.

More Telugu News