: తీవ్ర నిరాశలో కూరుకుపోయిన సింగరేణి కార్మికుల వారసులు.. దిక్కు తోచని స్థితిలో కుటుంబాలు

సింగరేణి కార్మికులు గత 18 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారసత్వ  ఉద్యోగాలకు కేసీఆర్ ప్రభుత్వం ఆమధ్య పచ్చజెండా ఊపడంతో... వారి కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ హైకోర్టులో వేసిన ఓ పిల్ వారి ఆనందాన్ని ఆవిరి చేసింది. వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పును వెలువరించింది. గతంలో మాదిరిగానే అనారోగ్యంతో ఉన్న కార్మికుల వారసులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

హైకోర్టు తీర్పుతో సింగరేణి కార్మికుల వారసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారసత్వ ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో కార్మికులు, వారి కుటుంబసభ్యులు తమ భవిష్యత్తు ప్రణాళికలను రచించుకున్నారు. అల్లుడికి ఉద్యోగాన్ని ఎర చూపించి... తమ అమ్మాయిలకు పెళ్లిళ్లు కూడా చేశారు కొందరు. కట్నం బదులుగా ఉద్యోగ భరోసాను కల్పించి పెళ్లిళ్లు చేశారు. కుమారుడికి ఉద్యోగం వస్తుందని చెప్పి, కోడళ్లను తెచ్చుకున్నారు మరికొందరు. మరోవైపు, ఇద్దరు కుమారులున్న వారు... ఒక కుమారుడికి కొంత ఆస్తిని ఇచ్చి, మరో కుమారుడికి వారసత్వ ఉద్యోగాన్ని రాసిచ్చారు. ఈ నేపథ్యంలో, ఆస్తులు, డబ్బులు తీసుకున్న వారు సంతోషంగా ఉండగా... ఉద్యోగాన్ని తీసుకునేందుకు అంగీకరించిన వారి నెత్తిన పిడుగు పడినట్టైంది. హైకోర్టు తీర్పుతో ఎన్నో కుటుంబాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారైంది.

More Telugu News