: నిర్భయంగా సాక్ష్యం చెప్పిన 9 ఏళ్ల చిన్నారి.. ఇద్దరికి యావజ్జీవ శిక్ష

కోర్టులో ఏదైనా సాక్ష్యం చెప్పాలంటే అందరూ భయపడిపోతుంటారు. సాక్ష్యం చెబితే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయంతో... మనకెందుకులే అని ఊరుకుండి పోతుంటారు. కానీ, ఓ తొమ్మిదేళ్ల బాలిక మాత్రం నిర్భయంగా సాక్ష్యం చెప్పింది. దీంతో, ఇద్దరు నేరస్తులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.

వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రలోని భివాండీలో ఉన్న గాయత్రి నగర్ లో శివాజీ జాదవ్ అనే వ్యక్తి 2010 అక్టోబర్ 2న హత్యకు గురయ్యాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో విజయ్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలసి జాదవ్ ను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 11 మంది సాక్షులను విచారించినప్పటికీ... ఏ ఒక్కరు కూడా నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదు. కానీ తొమ్మిదేళ్ల బాలిక మాత్రం నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం ఆధారంగానే థానే జిల్లా కోర్టు నిందితులు కామ్లిబాయ్ వాఘె, షారుఖ్ ఖాన్ లకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. మరో నిందితుడు విజయ్ పవార్ ను మాత్రం సంశయ లాభం కింద విడుదల చేసింది.

More Telugu News