: భారత్ తొట్టతొలి ప్రైవేట్ మూన్ మిషన్‌కు ఏడు టీములు ఎంపిక!

డిసెంబరులో భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న తొలి ప్రైవేటు మూన్ మిషన్‌ కోసం ఏడు బృందాలు ఎంపికైనట్టు స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ ‘టీమ్ఇండస్’ తెలిపింది. వీటిలో మూడు బృందాలు దేశానికి సంబంధించినవేనని పేర్కొంది. కలిస్టో, ఇయర్స్, కల్పన (భారత్), స్పేస్4 లైఫ్ (ఇటలీ), లునాడోమ్ (బ్రిటన్), కిల్లా ల్యాబ్ (పెరు), రెగోలిత్ రివల్యూషన్ (అమెరికా) బృందాలు ఎంపికైనట్టు టీమ్ఇండస్ పేర్కొంది. ఈ టీములు తమ అంతరిక్ష నౌక (రోబో) ద్వారా చంద్రుడిపై పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపింది. టీమ్ఇండస్ అంతరిక్ష నౌకను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన పీఎస్ఎల్వీ ద్వారా చంద్రుడిపైకి పంపుతుంది. టీమ్ ఇండస్ రోవర్ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన ఇరవై మంది విశ్రాంత శాస్త్రవేత్తలతో పాటు మొత్తం వంద మంది ఇంజనీర్లు బెంగళూరులో డిజైన్ చేసి, తయారుచేశారు.  

More Telugu News