: ఇది నాలుగు తరాల నేతలు, కార్యకర్తల త్యాగం, శ్రమ!: ప్రధాని మోదీ

ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీకి ప్రస్తుతం స్వర్ణ యుగం నడుస్తోందని, అయితే, అందుకోసం నాలుగు తరాల నేతలు, కార్యకర్తల త్యాగం, శ్రమ ఉన్నాయని, తమ పార్టీకి ఈ విజయాలు అంత సులభంగా దక్కలేదని అన్నారు. బీజేపీ విజయాలు పార్టీలో నేతలకు, కార్యకర్తలకు మరింత సేవలు చేసేలా ప్రేరణ కలిగించేవిగా ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని పార్టీ శ్రేణులకు మోదీ పిలుపు నిచ్చారు.

ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం తనకు కొత్త భారతదేశాన్ని దర్శింపజేస్తోందని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. తమకు ఓటేసినా, వేయకున్నా తమ ప్రభుత్వం అందరిదీ అని, అందరినీ కలుపుకుంటూ పోతామని, అందరి సంక్షేమం కోరతామని, అధికారం అన్నది ప్రజలకు సేవ చేసేందుకే అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాబోయే రోజుల్లో పేదలు, మధ్య తరగతి వర్గ ప్రజలపై భారం తగ్గించే చర్యలు చేపడతామని, 2022 నాటికి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మోదీ అన్నారు.

More Telugu News