: కుంబ్లేకు డైరెక్టర్ గా ప్రమోషన్.... టీమిండియా చీఫ్ కోచ్ గా ద్రవిడ్?

బీసీసీఐలో లోధా కమిటీ సిఫారసుల మేరకు సంస్కరణలకు తెరలేచింది. ఈ నేపథ్యంలో బీసీసీఐలో పలు మార్పులతో పాటు టీమిండియా మేనేజ్ మెంట్ లో కూడా మార్పులు తీసుకొచ్చే దిశగా పావులు కదుపుతోంది. తొలుత టీమిండియా మేనేజ్ మెంట్ లో మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. కుంబ్లే సారధ్యంలోని టీమిండియా విజయపరంపర కొనసాగిస్తుండడానికి తోడు, వరల్డ్ నెంబర్ వన్ స్థానం కూడా సాధించడం పట్ల బీసీసీఐ ఆనందంగా ఉంది. ఈ క్రమంలో కుంబ్లేకు ప్రమోషన్ ఇచ్చే దిశగా పావులు కదుపుతోంది. దీంతో కుంబ్లేకు గతంలో రవిశాస్త్రి చేపట్టిన టీమిండియా డైరెక్టర్ బాధ్యతలు అప్పగించనుంది.

ఈ విధుల్లో భాగంగా అనిల్ కుంబ్లే టీమిండియాతో పాటు, జూనియర్ జట్లను కూడా సమన్వయం చేసి, స్పూర్తి నింపాల్సి ఉంటుంది. తద్వారా ఇప్పుడు టీమిండియా సలహా కమిటీని తొలగిస్తారు. ఈ కమిటీలో సచిన్, లక్ష్మణ్, గంగూలీ సభ్యులన్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా చీఫ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ను నియమించనుంది. జూనియర్ జట్లను ద్రవిడ్ నడిపించిన విధానం, జూనియర్ ఆటగాళ్ల ఆటతీరులో ద్రవిడ్ తెచ్చిన మార్పు టీమిండియాకు ఎంతో అవసరమని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో కుంబ్లే, ద్రవిడ్ లకు ప్రమోషన్ ఇచ్చి వారికి సరైన గుర్తింపునివ్వాలని భావిస్తోంది. 

More Telugu News