: ముగిసిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం.. ఆయా పార్టీలు గెలుచుకున్న సీట్ల వివరాలు

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ముగిసింది. మినీ భార‌త్‌గా పిలుచుకునే ఉత్త‌రప్ర‌దేశ్‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భంజ‌నం సృష్టించింది. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉన్న ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా బీజేపీ ఏకంగా 325 సీట్లు గెలుచుకుంది. మ‌రోవైపు ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ విజ‌య దుందుభి మోగించింది. ఇక‌ పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపొందిన విష‌యం తెలిసిందే. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఎవ్వ‌రికీ మ్యాజిక్ ఫిగ‌ర్ ద‌క్క‌లేదు. దీంతో ఇత‌రులతో మంత‌నాలు చేసే యోచన‌లో ఆయా పార్టీలు ఉన్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో ఆయా పార్టీలు గెలుచుకున్న సీట్ల వివ‌రాలు:
 
ఉత్తరప్రదేశ్ (మొత్తం సీట్లు-403, మ్యాజిక్ ఫిగ‌ర్ 202):
బీజేపీ - 325, సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్ కూట‌మి- 54, బీఎస్పీ - 19, ఇతరులు - 5.

ఉత్తరాఖండ్  (మొత్తం సీట్లు-70, మ్యాజిక్ ఫిగ‌ర్ 36):
బీజేపీ - 57, కాంగ్రెస్ - 11, ఇతరులు 2.

పంజాబ్  (మొత్తం సీట్లు-117, మ్యాజిక్ ఫిగ‌ర్ 59):
కాంగ్రెస్ - 77, అకాలీదళ్- బీజేపీ - 18, ఆప్ - 22, ఇతరులు - 0.

గోవా (మొత్తం సీట్లు-40, మ్యాజిక్ ఫిగ‌ర్ 21):
బీజేపీ - 13, కాంగ్రెస్ - 17, ఇతరులు - 10, ఆప్-0.

మణిపూర్
(60):
కాంగ్రెస్ - 28, బీజేపీ - 21, ఇతరులు 11.

More Telugu News