: ఆస్ట్రేలియాకు మరో షాక్.. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఇంకా కోలుకోలేదు!

ఆస్ట్రేలియా జట్టుకు మరోషాక్ తగిలింది. బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెడు టెస్టుల్లో అద్భుతంగా రాణించిన మిచెల్ మార్ష్ గాయంతో టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. మిడిల్ ఆర్డర్ భారాన్ని మోసే మిచెల్ మార్ష్ జట్టుకు దూరం కావడంతో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులకు సిద్ధపడ్డ ఆసీస్ కు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ గాయం కారణంగా రాంచీ టెస్టుకు దూరం కానున్నాడు.

బెంగళూరు టెస్టుకు, రాంచీ టెస్టుకు మధ్య విరామం ఉండడంతో గాయం నుంచి స్టార్క్ కోలుకుంటాడని ఆసీస్ ఫిజియో డేవిడ్ బెక్ లీ భావించారు. అయితే ఆయన ఆశలు వమ్ముచేస్తూ స్టార్క్ కోలుకోలేదు. దీంతో రాంచీ టెస్టుకు స్టార్క్ దూరం కానున్నాడు. దీంతో టీమిండియా టాపార్డర్ పతనంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన స్టార్క్ లేని లోటును ఆసీస్ కు భారంగా పరిణమించగా, భారత్ కు వరంలా మారనుంది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ ను కూల్చి, పరుగులు నియంత్రించడంలో స్టార్క్ ది కీలక పాత్ర. మార్ష్, స్టార్క్ గాయాల పాలు కావడంతో టీమిండియాకు విజయావకాశాలు మెరుగుపడ్డాయి. 

More Telugu News