: ‘కగుల్’ను సొంతం చేసుకున్న ‘గూగుల్’

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది డేటా సైంటిస్టులు వినియోగించే ‘కగుల్’ను గూగుల్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ‘గ్లూగుల్ క్లౌడ్’ ముఖ్య శాస్త్రవేత్త ఫీఫీలి తెలిపారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్సోలో నిర్వహించిన ‘క్లౌడ్ నెక్స్ట్ 2017’ సదస్సులో ఫీఫీలి మాట్లాడుతూ, ‘కగుల్’ను కొనుగోలు చేశామని చెప్పారు. అయితే, దీనిని ఎంత మొత్తానికి కొనుగోలు చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. డేటా, డెవలపర్ కమ్యూనిటీని సంస్థ ప్రజాస్వామ్యయుతంగా మార్చిందని, ఈ సంస్థతో భాగస్వామ్యం తమకు సానుకూలం అవుతుందని పేర్కొన్నారు. కాగా, 2010లో ‘కగుల్’ను స్థాపించారు. 

More Telugu News