: బాలయ్య 101వ చిత్రం ప్రారంభం

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో బాలకృష్ణ 101వ చిత్రానికి ఈ ఉదయం అంకురార్పణ జరిగింది. తులసీవనం టెంపుల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్ర ప్రారంభ పూజలు జరుగగా, బాలయ్య, పూరీలతో పాటు మరో దర్శకుడు బోయపాటి శ్రీను, కమేడియన్ అలీ తదితరులు పాల్గొన్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా, స్క్రిప్టును వెంకటేశ్వరుని పాదాలచెంత ఉంచి స్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం చిత్రం షూటింగ్ అధికారికంగా ప్రారంభమైనట్లయింది.

More Telugu News