: ఏకంగా 100 విమానాలతో భారత విమానయాన రంగంలోకి దిగనున్న 'ఖతార్ ఎయిర్'!

శరవేగంగా అభివృద్ధి చెందుతూ, అపరిమితమైన అవకాశాలను అందిస్తున్న భారత విమానయాన రంగంపై కన్నేసిన ఖతార్ ఎయర్ వేస్, ప్రత్యేక భారత సబ్ సైడరీ సంస్థను ప్రారంభించాలని యోచిస్తోంది. ఖతార్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ ఆర్థిక అండతో, ఏకంగా 100 విమానాలను రంగంలోకి దించడం ద్వారా ఇండియాలో కాలు మోపాలని భావిస్తున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్బర్ అల్ బకర్ వెల్లడించారు.

ఐటీబీ బెర్లిన్ ట్రావెల్ ఫెయిర్ లో పాల్గొన్న ఆయన, భారత్ లో తమ సామ్రాజ్యాన్ని దశలవారీగా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ట్రావెల్ మార్కెట్లలో ఇండియా ఒకటని, తొలి దశలో 100 నారో బాడీ విమానాలను ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉన్నామని ఆయన అన్నారు. కాగా, 2015లోనే భారత మార్కెట్ పై కన్నేసిన ఖతార్ ఎయిర్, ఇండిగోలో వాటాలు కొనాలని భావించి విఫలమైన సంగతి తెలిసిందే.

More Telugu News