: ఉగ్రవాది ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసిన పోలీసులు

లక్నోలో ఠాకూర్ గంజ్ లో మట్టుబెట్టిన ఉగ్రవాది సైఫుల్లా ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. సైఫుల్లా ఉంటున్న ఇంటిని గుర్తించిన ఏటీఎస్ సిబ్బంది, అతను ఇంట్లో ఉన్నాడని నిర్ధారించుకుని చుట్టుముట్టారు. దీనిని గుర్తించిన సైఫుల్లా కాల్పులు ప్రారంభించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతూ హెచ్చరికలు చేశారు. ఉజ్జయినీ రైలు ప్రమాదం నిందితుడిగా పేర్కొంటూ పలు సూచనలు చేస్తూ లొంగిపోవాలని హెచ్చరించారు. దీనికి అంగీకరించని సైఫుల్లా మళ్లీ కాల్పులు జరిపాడు. దీంతో సైఫుల్లా సోదరుడికి ఫోన్ చేసిన ఏటీఎస్ అధికారులు విషయం వివరించి లొంగిపోవాల్సిందిగా సూచించాలని కోరారు. దీంతో అతని సోదరుడు లైన్ లో ఉన్నాడని, అతనితో మాట్లాడాలని సూచిస్తూ పోలీసులు తలుపు కిందనుంచి ఫోన్ ను లోపలికి తోశారు.

దీంతో తన సోదరుడితో మాట్లాడని సైఫుల్లా తాను భద్రతా దళాలకు లొంగిపోయేది లేదని, బలవ్వాలనుకుంటున్నానని తెలిపాడు. దీంతో భద్రతా దళాలు ముందు భాష్పవాయు గోళాలు, తరువాత పెప్పర్ బాంబులు వేశారు. వాటికి ఎలాంటి వ్యక్తి అయినా బయటకు వస్తారు. కానీ సైఫుల్లా మాత్రం బయటకు రాలేదు. దీంతో అతనిని వారు మట్టుబెట్టారు. అనంతరం లోపలికి ప్రవేశించిన పోలీసులకు అతని గదిలో భారీ ఎత్తున ఆయుధాలు, ఐఎస్ఐఎస్ జెండాలు కపించాయి. దీంతో వారు ఆశ్చర్యపోయారు. కాగా, అతనిని సజీవంగా పట్టుకుని ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల అసలు ప్లాన్ ఏంటి? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా ఎంత మంది పని చేస్తున్నారు? వంటి వివరాలు తెలుసుకోవాలని భావించారు. అందుకే చివరి వరకు అతని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

More Telugu News