: ట్రంప్‌ నన్ను ప్రేమిస్తున్నారేమో.. అందుకే ఆ ట్వీట్ చేశారు: హాలీవుడ్ స్టార్

‘ద న్యూ సెల‌బ్రిటీ అప్రెంటిస్’ అనే టీవీ షోకు హాలీవుడ్ స్టార్ అర్నాల్డ్ ష్వార్జనేగర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ టీవీ షోకు ఇప్ప‌టికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా ఉండ‌డంతో ఇప్పుడు ఆ షోకు ఆద‌ర‌ణ త‌గ్గిపోయి విప‌రీతంగా రేటింగ్స్ ప‌డిపోయాయ‌ని ఆరోపిస్తూ ఇటీవ‌లే ఆయ‌న ఆ షోకు గుడ్ బై చెప్పిన‌ట్లు తెలిపారు. ఈ క్రమంలో, ఈ విష‌యంపై ట్రంప్ స్పందించారు.

ఆర్నాల్డ్‌కు తక్కువ రేటింగ్స్‌ రావడంపై ఆయ‌న ట్వీట్ చేస్తూ.. 'ది సెలబ్రిటీ అప్రెంటీస్‌' నుంచి తక్కువ రేటింగ్స్‌ కారణంగానే ఆర్నాల్డ్‌ను తీసేశారని పేర్కొన్నారు. అంతేగాక‌ అది తనను బాధకు గురిచేసినట్లు చెప్పారు. అయితే, ట్రంప్ ట్వీట్‌పై అర్నాల్డ్ విభిన్న రీతిలో స్పందించారు. ఒక వేళ‌ ట్రంప్‌ తనను ప్రేమిస్తున్నారేమోన‌ని అందుకే ఆ ట్వీట్ చేశారేమోన‌ని ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ చెప్పారు.

More Telugu News