: దేశంలోనే అతిపెద్ద మూడో జాతీయ రహదారిగా అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే!

393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ రహదారి కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రహదారిలో 185.4 కిలోమీటర్లలో నాలుగు వరుసలు, 208.19 కిలోమీటర్ల పొడవులో ఆరు వరుసలుగా నిర్మించనున్నట్టు తెలిపారు.

విజయవాడ-మచిలీపట్నం మధ్య 64.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న 9వ జాతీయ రహదారి ప్రాజెక్టుకు రూ.740.70 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అలాగే విజయవాడ బెంజిసర్కిల్ వద్ద 618 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఫ్లైఓవర్‌కు సంబంధించి డిజైన్లు సిద్ధమయ్యాయన్నారు. భోగాపురం-భీమిలి, విశాఖపట్టణం-భీమిలి మధ్య నిర్మించనున్న బీచ్ రహదారులతో జాతీయ రహదారులను కలపడం ద్వారా సౌందర్యమాల ప్రాజెక్టు సాకారం అవుతుందని ముఖ్యమంత్రి వివరించారు.

More Telugu News