: ట్రంప్ ఎఫెక్ట్‌: అత్యుత్త‌మ‌ దేశాల జాబితాలో ఏడో స్థానానికి ప‌డిపోయిన అమెరికా

యూనివ‌ర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్ట‌న్ స్కూల్ అండ్ గ్లోబ‌ల్ గ్రాండ్ క‌న్స‌ల్టెంట్స్‌కు చెందిన‌ యూఎస్ న్యూస్ అండ్ వ‌ర‌ల్డ్ రిపోర్ట్ ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ దేశాల జాబితాను విడుద‌ల చేసింది. ఇందులో స్విట్జ‌ర్లాండ్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా రెండు, మూడో స్థానాల్లో కెన‌డా, బ్రిట‌న్ దేశాలు ఉన్నాయి. గ‌త ఏడాది కాలంలో అమెరికా ప‌ట్ల ప్ర‌తికూల‌త‌లు ఎక్కువ‌వుతుండ‌టం, 2016 చివ‌ర్లో ఆ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌ల త‌ర్వాత అమెరికా నాయ‌క‌త్వంపై గౌర‌వం త‌గ్గిపోవ‌డంతో అమెరికా ఏడో స్థానానికి ప‌డిపోయింది. 2016లో ఈ జాబితాలో ఆమెరికా నాలుగోస్థానంలో ఉండేది.

ఈ జాబితాలో జ‌ర్మ‌నీ, జ‌పాన్‌, స్వీడ‌న్.. అమెరికా క‌న్నా ముందుకు దూసుకెళ్లాయి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు జ‌రిగిన అనంత‌రం ఈ స‌ర్వే నిర్వ‌హించి ఈ జాబితాను తాజాగా విడుద‌ల చేశారు. ఇందుకోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ దేశాల‌కు చెందిన 21 వేల మంది వ్యాపార‌వేత్తలు, ప్ర‌ముఖులతో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు సేక‌రించారు. ఈ స‌ర్వే ద్వారా రాజ‌కీయ మార్పులు ఒక దేశంపై ఎలాంటి ప్ర‌భావం చూపిస్తాయో తెలిసింద‌ని యూఎస్ న్యూస్ ఎడిట‌ర్ బ్రియ‌న్ కెల్లీ పేర్కొన్నారు. అమెరికాలో నాయ‌క‌త్వం మార‌డంతో ఆ దేశంపై గౌర‌వం త‌గ్గిపోయింద‌ని ఈ స‌ర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌.

More Telugu News