: ఇంతకుముందు మైకులు ఆన్ లో ఉన్నాయా? లేదా? అన్నది తెలిసేది... ఇప్పుడు దీని దిక్కు చూడాలో, మీ దిక్కు చూడాల్నో తెలియడం లేదు!: జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు నవ్వులు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో ఏర్పాటు చేసిన అధునాతన ధ్వని వ్యవస్థపై విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులను పూయించాయి. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల వేళ, 50 యూనిట్లకన్నా తక్కువగా విద్యుత్ వాడే పేదలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రశ్న రాగా, మంత్రులు అచ్చెన్నాయుడు, గంటాలు సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు.

ఈ సమయంలో తనకు మైకు కావాలని కోరిన జగన్, మాట్లాడుతూ, "ఇంతకుముందు కొద్దొ గొప్పో మైకులు ఆన్ లో ఉన్నాయా? లేదా? అన్నది మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో తెలియడంలా. ఎందుకు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. దీని దిక్కు చూడాల్నో, మీ దిక్కు చూడాల్నో మాకు అర్థం కావడంలా" అని వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ సహా చంద్రబాబు, ఇతర సభ్యులు నవ్వుతూ ఉండటం కనిపించింది. కాగా, పాత సంప్రదాయ మైకుల స్థానంలో అత్యాధునిక సెన్సర్లు వాడుతూ సౌండ్ సిస్టమ్ ను అసెంబ్లీలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News