: నాన్నగారి సినిమాపై నా తమ్ముడు ఇంకా ఏమీ అడగలేదు... అడిగితే చెబుతా: పురందేశ్వరి

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను ఓ చిత్రంగా మలచాలని భావిస్తున్న తన తమ్ముడు, ఈ విషయంలో సలహా కావాలని తన దగ్గరకు వస్తే, సూచనలు చేసేందుకు సిద్ధమని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ఈ విషయమై బాలకృష్ణ ఇంతవరకూ తనను సంప్రదించలేదని అన్నారు.

"డెఫినెట్ గా ఇవాళ ఓ బాధ్యత మాత్రం తమ్ముడి మీద ఉంటుంది. ఎందుకంటే, నాన్నగారి సినిమా తీస్తున్న సందర్భంలో... రామారావుగారి జీవితం తెరచిన పుస్తకం. ప్రతి ఒక్క సంఘటనా కూడా ప్రజలందరికీ తెలుసు. కనుక దాన్ని వక్రీకరించడం, ఇంకో రకంగా చూపించేటు వంటి అవకాశం బాలకృష్ణకు ఉండదు. ఆ పరిధిలోనే సినిమా తీయాల్సివుంటుంది. ఆ బాధ్యతను తెలుసుకునే సినిమా తీస్తారని అనుకుంటున్నా" అని చెప్పారు.

More Telugu News