: హెచ్1-బీ వివాదం వాణిజ్య అంశమే... భారత ఉద్యోగులకు ఇబ్బందులు లేవు: యూఎస్ అధికారులతో చర్చల అనంతరం జైశంకర్

హెచ్1-బీ వీసాల విషయంలో అమెరికన్ ప్రభుత్వం తీసుకు వస్తున్న మార్పులను వాణిజ్య పరమైన అంశంగానే చూడాలని, ఇమిగ్రేషన్ కు సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ వ్యాఖ్యానించారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా, అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన ఆయన, మీడియాతో మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా తమ దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని, ఈ విషయంలో అమెరికా, భారత్ లు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయని అన్నారు.

అమెరికాతో దీర్ఘకాల బంధం కొనసాగుతుందని ఆయన అన్నారు. కాగా, యూఎస్ మంత్రులు రెక్స్ టిల్లర్ సన్, విల్ బుల్ రాస్, జాన్ కెల్లీలతో పాటు జాతీయ భద్రతా సలహాదారు హెచ్ ఆర్ మెక్ మాస్టర్ లతో జైశంకర్ చర్చలు జరిపారు. కొత్త వీసాల బిల్లులు, భారతీయుల ఆందోళనలను ఈ సందర్భంగా ఆయన అమెరికా దృష్టికి తీసుకువెళ్లారు. ఇండియాతో మరింత బలమైన ద్వైపాక్షిక బంధం కోసం అమెరికన్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా జైశంకర్ వ్యాఖ్యానించారు. జైశంకర్, తన పర్యటనలో భాగంగా పలువురు విపక్ష నేతలనూ కలుసుకున్నారు.

More Telugu News