: పాములు, తేళ్లను తినగలిగే భారత సైన్యం... అత్యంత కఠోర శిక్షణ!

అత్యంత కఠిన పరిస్థితుల మధ్య భారత సైన్యం యుద్ధం చేయాల్సి వస్తే... తినడానికి తిండి లేని పరిస్థితి ఏర్పడితే... సులువుగా ముందడుగు వేసి, శత్రువులను మట్టుపెట్టి వారు వెనక్కు తిరిగి వచ్చేందుకు అవసరమైన ఆహార పదార్థాలు అందుబాటులో లేకుంటే... ఇటువంటి స్థితి ఏర్పడితే, ఎలా మెలగాలన్న విషయమై సైనికులకు కఠోర శిక్షణను ఇస్తున్నారు. ఇందులో భాగంగా అడవుల్లో విరివిగా కనిపించే పాములు, తేళ్లు, వివిధ రకాల కీటకాలను తినడం కూడా భాగమే. మిజోరాంలోని జంగిల్ వార్ ఫేర్ స్కూల్ లో ఈ తరహా శిక్షణలో సైన్యం రాటుదేలుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో దాగున్న ఉగ్రవాదులు, చొరబాటుదారులను ఏరివేయడంతో పాటు, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో రోజుల తరబడి జనావాసాలకు దూరంగా ఉండాల్సి వస్తే ఈ తరహా శిక్షణ ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు.

More Telugu News