: చంద్రయాన్-2కు సర్వం సిద్ధం చేస్తోన్న ఇస్రో

చంద్రయాన్-1 ప్రయోగంతో మన దేశ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. ఇప్పుడు చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధమవుతోంది. 2018 ప్రథమార్థంలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. చంద్రునిపై స్పేస్ క్రాఫ్ట్ ను ల్యాండ్ చేసేందుకు అవసరమయ్యే టెక్నాలజీపై ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఓ కృత్రిమ క్వార్టర్ లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు. చల్లకెర, తరునల్వేలి, మహేంద్రగిరిల్లో గ్రౌండ్ టెస్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. చంద్రయాన్-2లో ఒక ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్ లు ఉంటాయని... ఇది చంద్రయాన్-1కు ఆధునిక వర్షన్ అని తెలిపారు. 

More Telugu News