: కొత్త ఆఫర్లు: ‘జియో’ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే ఇలా.. లేకుంటా అలా..!

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ ఈ నెలతో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్‌షిప్‌తోపాటు టారిఫ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. బుధవారం నుంచి మెంబర్‌షిప్ నమోదు కార్యక్రమం మొదలైంది. ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలనుకునేవారు తొలుత రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సభ్యత్వం కనుక తీసుకుంటే ఇప్పుడున్న ఆఫర్‌ను మరో ఏడాదిపాటు పొందే వీలుంటుంది. అంటే నెలకు రూ.303తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు 1జీబీ 4జీ హైస్పీడ్ డేటాతోపాటు ప్రస్తుతం అందుకుంటున్న ఆఫర్లను కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే దీనితోపాటు ప్రైమ్ మెంబర్ల కోసం ‘జియో’ తాజాగా మరికొన్ని ప్లాన్లు విడుదల చేసింది. వాటి ప్రకారం జియో ప్రైమ్ మెంబర్లు, నాన్ ప్రైమ్ యూజర్లకు అందే డేటా ప్యాక్‌లలో తేడాలను గమనిస్తే..

రూ.19 ప్లాన్ ద్వారా ప్రైమ్ యూజర్లు ఒక రోజు వ్యాలిడిటీతో 200 ఎంబీ డేటా పొందొచ్చు. అదే నాన్ ప్రైమ్ యూజర్లకు అయితే 100 ఎంబీ డేటా మాత్రమే. రూ.49  ప్లాన్‌తో ప్రైమ్ మెంబర్లు మూడు రోజుల వ్యాలిడిటీతో 600 ఎంబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రం 300 ఎంబీనే అందుతుంది. రూ.96 ప్లాన్‌తో ప్రైమ్ యూజర్లు ఏడు రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ పొందొచ్చు. నాన్ ప్రైమ్ మెంబర్లుకు మాత్రం 600 ఎంబీనే ఇస్తారు.

రూ.149తో ప్రైమ్ మెంబర్లకు 28 రోజల వ్యాలిడిటీతో 2జీబీ డేటా, నాన్ ప్రైమ్ మెంబర్లకు 1జీబీ డేటా లభిస్తుంది. రూ.303తో 28 రోజుల వ్యాలిడిటీతో ప్రైమ్ మెంబర్లకు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ మెంబర్లకు 2.5జీబీ డేటా లభిస్తుంది. రూ.499తో ప్రైమ్ మెంబర్లకు 58జీబీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. రూ.999 ప్లాన్‌తో ప్రైమ్ మెంబర్లకు 60 రోజుల వ్యాలిడిటీతో 60జీబీ, నాన్ ప్రైమ్ మెంబర్లకు 12.5జీబీ డేటా పొందవచ్చు.

More Telugu News