: మరో కలకలం.. కాటమరాయుడు సినిమాలో కీలక ఫైట్ సీన్ లీక్.. ఆన్ లైన్ లో హల్ చల్

సినీన‌టుడు పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా కూడా పైర‌సీ బారిన ప‌డింది. గ‌తంలోనూ అత్తారింటికి దారేదితో పాటు పలు ప‌వ‌న్ సినిమాలు విడుద‌ల‌కు ముందే ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కాట‌మ‌రాయుడి చిత్రంలో కీల‌క యాక్ష‌న్ సీన్ ఒకటి ఆన్ లైన్ లో ప్ర‌త్య‌క్ష‌మైంది. సినిమా విశ్రాంతి సమయంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ కు సంబంధించిన సీన్ ఇద‌ని భావిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లో ప‌వ‌న్ చేసిన ఫైటింగులు ఇందులో క‌న‌ప‌డుతున్నాయి. అంతేకాదు సినిమా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలకు సంబంధించిన ప‌లు ఫొటోలు కూడా ఆన్ లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

More Telugu News