: డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియాతో ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించాం: ఉపాసన రాంచరణ్

డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియాతో అపోలో ఆసుపత్రుల ఫౌండేషన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్టు ఫౌండేషన్ ఛైర్ పర్సన్ ఉపాసన రామ్ చరణ్ తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా సెక్రటరీ జనరల్ రవిసింగ్ తో కలసి ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. అటవీ సిబ్బంది, స్థానికులకు వైద్యం అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం కింద హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పని చేస్తున్న అటవీ సిబ్బందికి, స్థానికులకు వైద్య సేవలు అందిస్తారు. 2017 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా ఉపాసన తెలిపారు.

More Telugu News