: ఇకపై మూడు గంటల్లోనే పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు!

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) తమ ల‌బ్ధిదారుల‌కు శుభ‌వార్త అందించింది. క్లైయిమ్స్ సెటిల్ మెంట్ కోసం ఆన్ లైన్ ప్రక్రియను త్వ‌ర‌లోనే లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ విధానం ద్వారా ఇక‌పై విత్ డ్రాయల్ ప్రక్రియ గంటల వ్యవధిలోనే పూర్త‌వుతుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 20 రోజుల వ్యవధి పడుతోంది. ఈ విధానం ద్వారా ఈపీఎఫ్‌ విత్ డ్రాయల్, పెన్షన్ స్థిరీకరణ వంటి ప‌లు సౌక‌ర్యాలు అంద‌నున్నాయి.

ప్రస్తుతం ఈపీఎఫ్ విత్ డ్రాయల్ క్లైయిమ్ కోసం దాదాపు కోటి దరఖాస్తులు త‌మ కార్యాల‌యానికి వ‌చ్చాయ‌ని, పీఎఫ్ విత్ డ్రా, పెన్షన్ స్థిరీకరణ, మరణించిన వారి ఇన్సూరెన్స్ లబ్ధి వంటి దరఖాస్తులు త‌మ‌కు అందాయ‌ని స‌ద‌రు ఆర్గ‌నైజేష‌న్ తెలిపింది. తాము ప్ర‌స్తుతం ఆన్‌లైన్ సేవ‌ల‌ను అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పింది. ఈ ఏడాది మే చివరి వరకు అన్ని దరఖాస్తులను, క్లైయిమ్ ల‌ను ఆన్ లైన్ లోనే నమోదు చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ పేర్కొంది. దీంతో ఈపీఎఫ్‌ విత్ డ్రాయల్ క్లైయిమ్ ప్రక్రియ మూడు గంటల్లోనే ముగుస్తుంద‌ని చెప్పింది. ఇందుకోసం పెన్షనర్లు, సబ్ స్క్రైబర్లందరూ తప్పనిసరిగా ఈపీఎఫ్ఓ వద్ద తమ ఆధార్ నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది.

More Telugu News