: పాకిస్థాన్ లోని హిందువుల కల నెరవేరింది!

పాకిస్థాన్ లోని హిందువుల సుదీర్ఘ కల నెరవేరింది. హిందూ వివాహ బిల్లుకు ఆ దేశంలోని పెద్దల సభ (సెనేట్) ఆమెదం తెలిపింది. దీంతో, పాక్ లోని హిందువులకు ప్రత్యేక వివాహ చట్టం అధికారికంగా అమల్లోకి రానుంది. జాతీయ అసెంబ్లీలో గత ఏడాది సెప్టెంబర్ 26న ఈ బిల్లుకు ఆమోదం లభించింది. వచ్చే వారం దేశాధ్యక్షుడి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారుతుంది. ఈ చట్టం వల్ల హిందువులకు రక్షణ పెరుగుతుంది. ముఖ్యంగా బలూచిస్థాన్, పంజాబ్, ఖైబర్ ప్రాంతాల్లో ఉన్న హిందువులకు ఈ బిల్లు అత్యంత కీలకం అవుతుంది. సభలో ఎలాంటి వ్యతిరేకత లేకుండా ఈ బిల్లు ఆమోదం పొందడం గమనించదగ్గ అంశం. ఈ బిల్లు కోసం దశాబ్దాలుగా పాక్ లోని హిందువులు వేచి చూస్తున్నారు.


More Telugu News