: నిన్నటి వరకు రాజభోగాలు...ఇకపై శశికళకు రోజు కూలీ 50 రూపాయలు

అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలిత నెచ్చెలిగా దశాబ్దాలు రాజభోగాలు అనుభవించిన శశికళ, ఆమె మరణంతో ఆమె స్థానాన్ని ఆక్రమించారు. దీంతో ఆమె మరిన్ని సౌఖ్యాలు అనుభవించారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో సహాయకురాలి స్థానాన్ని వదిలి ఓనర్ గా మారారు. అంతే కాకుండా చిన్నమ్మగా అడుగులకు మడుగులొత్తించుకున్నారు. అధికారం కోసం ఎమ్మెల్యేలను బస్సులో గోల్డెన్ రిసార్ట్ కు తరలించారు. అక్కడ కూడా సర్వ సౌఖ్యాలు అందుబాటులో ఉండేలా చూసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మొత్తం తల్లికిందులైంది. అయినా తగ్గని శశికళ... జైలులో కూడా ప్రత్యేక సౌకర్యాలు కావాలన్నారు. జైల్లో ఉన్నా తాను ప్రత్యేకమేనన్నారు. తనను బాగా చూసుకోవాలన్నారు.

దీంతో ఖైదీలు సాధారణంగా ఉండాలని, శిక్షలో అంతరార్థం అదేనని ఆమెకు గుర్తు చేసేలా జడ్జి ఆమెను సాధారణ ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. దీంతో వైద్యపరీక్షలు చేయించుకుని జైలులో అడుగుపెట్టిన శశికళ...జైలర్ తో తనకు ప్రత్యేక దుస్తులు ఉండాల్సిందేనని, జడ్జి దుస్తులపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని గుర్తు చేశారు. దీంతో సాధారణ జైలు జీవితం అని గుర్తు చేసిన జైలర్...ఆమె చేతికి ఖైదీలకు కేటాయించే వస్త్రాలు అందజేశారు. ఆమెను మానసికంగా సంసిద్ధురాలిని చేస్తూ...ఆదివారం నుంచి పని కేటాయిస్తామని తెలిపారు. ఆ పనికి రోజూ 50 రూపాయల కూలి కూడా వస్తుందని జైలర్ తెలిపారు. కావాలంటే పనిని ఎంచుకోవాలని జైలులో పనుల లిస్టును ఆమె చేతుల్లో ఉంచారు. దీంతో శశికళ ఆవేదనలో మునిగిపోయారు. 

More Telugu News