: దిగంతాలకు భారత ఖ్యాతి... 104 ఉపగ్రహాలూ కక్ష్యలోకి!

భారత కీర్తి పతాక మరోసారి జగద్వితమైంది. శాస్త్ర సాంకేతిక రంగంలో, ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ల ప్రయోగంలో ఇండియాకు తిరుగులేదని నిరూపించింది ఇస్రో. ఈ ఉదయం 9:28 నిమిషాలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లి, తనతో పాటు తీసుకెళ్లిన 104 ఉపగ్రహాలనూ విజయవంతంగా వాటి వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. మొత్తం 524 కిలోమీటర్ల దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను జార విడిచిందని, వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయని చెప్పారు. ఈ ప్రయోగం విజయంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.

More Telugu News