: పన్నీర్ రాజీనామా లేఖలోని సంతకంపై రాజ్‌భవన్ అనుమానం.. బయటపడిన తేడాలు!

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తూ పన్నీర్ సెల్వం పంపిన లేఖలోని సంతకంపై రాజ్‌భవన్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. నిజానికి రాజీనామా లేఖను గవర్నర్‌ను కలిసి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో గవర్నర్ ముంబైలో ఉండడంతో ఫ్యాక్స్ ద్వారా ఓపీఎస్ ఆ లేఖను గవర్నర్‌కు పంపారు. ఆ తర్వాత సీల్డ్ కవర్‌లో ఆ లేఖను రాజ్‌భవన్ అధికారులకు అందజేశారు. ఈనెల 9న గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నై చేరుకున్నాక ఆ లేఖను పరిశీలించారు. అందులో సీఎం పన్నీర్ సంతకం చూసి అది ఆయనదా? కాదా? పరిశీలించాలంటూ అధికారులను ఆదేశించారు. పరిశీలించిన అధికారులు సంతకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. నిజానికి ఓపీఎస్ తన సంతకం వద్ద తేదీలను, సమయాన్ని రాయరు. కానీ తాజా లేఖలో అవి ఉన్నాయి. అంతేకాదు తమ వద్ద ఉన్న రికార్డుల్లోని ఓపీఎస్ సంతకాలతో రాజీనామా లేఖలోని సంతకాన్ని పోల్చినప్పుడు ఈ తేడాలు బయటపడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

More Telugu News